హైదరాబాద్ లోని శ్రీ ఆదిత్య హోమ్స్ లో మూడో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. పలు రియల్ ఎస్టేట్ సంస్థల్లో సోదాలు నిర్వహిస్తున్నారు ఐటీ అధికారులు. ఊర్జిత,ట్రెడెంట్ ప్రాపర్టీస్ లో సోదాలు చేపట్టారు. బ్యాంక్ లావాదేవీలకు సంబంధించి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఐటీ సోదాలు జరుగుతున్న సమయంలో తప్పుడు ప్రచారం చేసిన వారి పై చట్టపరమైన చర్యలుంటాయని ఐటీ అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఐటీ రిటర్న్స్ లో అవతవకలను ఐటీ అధికారులు గుర్తించారు. ఫ్లాట్ల అమ్మకాలపై ఐటీ శాఖ వివరాలు సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐటీ అధికారులపై ఆదిత్య హోమ్స్ సిబ్బంది ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఐటీ అధికారులపై ఎండీ కోటా రెడ్డి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడానికి సిద్దమవుతున్నారు. ముగ్గురు అకౌంట్స్ ఉద్యోగులపై చేయి చేసుకున్నారని ఆరోపించారు. మూడు రోజులుగా ఆదిత్య హోమ్స్ పై ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో శ్రీ ఆదిత్య హోమ్స్ కార్యాలయానికి ఐటీ శాఖ ఉన్నత అధికారుల బృందం చేరుకోనుంది.
అయితే ఐటీ సోదాలు జరుగుతున్న సమయంలో తప్పుడు ప్రచారం చేసిన వారి పై చట్టపరమైన చర్యలు ఉంటాయని ఐటి అధికారులు హెచ్చరిస్తున్నారు. ఐటి అధికారులు వేధిస్తున్నారని శ్రీ ఆదిత్య హోమ్స్ సిబ్బంది బయట తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐటి అధికారులకు శ్రీ ఆదిత్య హోమ్స్ అకౌంట్ సిబ్బంది సహకరించడం లేదని అంటున్నారు. శ్రీ ఆదిత్య హోమ్స్ అకౌంట్స్ సిబ్బంది సహకరించకపోవడంతో మరింత ఆలస్యం అవుతుందని తెలుపుతున్నారు.
అయితే ఈ సోదాల్లో బ్యాంక్ లావాదేవీలకు సంబంధించి కీలక పత్రాలను ఇప్పటికే అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్లాట్ల అమ్మకాలు,కొనుగోలుకు సంబంధించిన వివరాలు ఆరా తీస్తున్నారు. అకౌంట్స్ సిబ్బంది నుంచి బ్యాంక్ లావాదేవీల వివరాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పలు రియల్ ఎస్టేట్ సంస్థలు సమర్పించిన ఆదాయపన్నుకు సంబంధించి అవకతవకలు గుర్తించిన ఐటి అధికారులు సోదాలు కొనసాగించాలని భావిస్తున్నారు.