కాంగ్రెస్ నేత అనిరుధ్ రెడ్డి నివాసంలో ఐటీ సోదాలు ముగిశాయి. గత నాలుగు రోజులగా ఆయన ఇంట్లో ఐటీ అధికారులు విస్తృత తనిఖీలు చేశారు. అనిరుధ్ రెడ్డి భార్య మంజూష ఎక్సెల్ కంపెనీ డైరెక్టర్ గా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఐటీ అధికారులు ఆయన నివాసంలో సోదాలు చేశారు.
శనివారం ఉదయం నుంచే ఐటీ తనిఖీలు కొనసాగాయి. ఎక్సెల్ గ్రూపులో పెట్టుబడులపై ఐటీ అధికారులు ఆరా తీసినట్టు తెలుస్తోంది. కంపెనీకి చెందిన పలు రికార్డులను ఐటీ అధికారులు పరిశీలించారు. అనంతరం అనిరుధ్ రెడ్డికి ఐటీ అధికారులు నోటీసులు ఇచ్చారు.
సోమవారం ఐటీ కార్యంలో విచారణకు హాజరు కావాలని ఆయనకు ఐటీ అధికారులు సూచించారు. ఐటీ ఫార్మట్‌లో ఆస్తుల వివరాలు సమర్పించాలని ఆయన్ని ఆదాయపన్ను శాఖ అధికారులు అదేశించారు.
ఎక్సెల్ కార్యాలయాల్లో ఐటీ తనిఖీలు బుధవారం మొదలయ్యాయి.
మొదటి రోజు గచ్చిబౌలిలోని ఎక్సెల్ ప్రధాన కార్యాలయంలో ఆదాయపన్ను శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మొత్తం 18 ప్రాంతాల్లో అధికారులు ఏక కాలంలో తనిఖీలు నిర్వహించారు. అధికారులు మొత్తం 20 బృందాలుగా విడిపోయిన తనిఖీలు చేపట్టారు.