– 20 చోట్ల 60 మంది తనిఖీలు
– ఐటీ, ఇంజనీర్, హెల్త్ కేర్, ఇన్ఫ్రాలలో సోదాలు
– భువనగిరి ఎంపీ సన్నిహితుడి కంపెనీలు
– రాహుల్ గాంధీ అనుచరులతో సన్నిహిత సంబంధాలు
– సౌత్ ఇండియాకి టైర్స్ సప్లై చేయడంలో దిట్ట
– ఐటీ రెయిడ్స్ వెనుక అసలు కారణాలేంటి..?
క్రైంబ్యూరో, తొలివెలుగు: హైదరాబాద్ లో ఆదాయపు పన్ను శాఖ మరోసారి దాడులకు దిగింది. ఇన్నాళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉన్న కంపెనీలపై సోదాలు నిర్వహిస్తే.. తాజాగా కాంగ్రెస్ నేత సన్నిహితుని కంపెనీల్లో తనిఖీలు జరగడం ఆయా వర్గాలను కలవరపెడుతోంది. ఎక్సెల్ గ్రూప్ గచ్చిబౌలి, బాచుపల్లి, చందానగర్, బొల్లారంతో పాటు డైరెక్టర్స్ ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. కడప జిల్లా రఘునాథ్ రెడ్డికి చెందిన ఈ కంపెనీలో కుటుంబ సభ్యులు డైరెక్టర్స్ గా ఉన్నారు. తన సొంత బ్రాండ్ తో టైర్లు తయారుచేసి మార్కెటింగ్ చేయడంలో విఫలమయినా.. ఇదే కంపెనీ నుంచి బిర్లా, విల్లాస్, యేస్, సియెట్ కంపెనీలకు హైదరాబాద్ నుంచే సౌత్ ఇండియాకు టైర్లు, రబ్బరు అందజేస్తోంది.
అనిరుథ్ రెడ్డికి లింకేంటి..?
ఐటీ దాడులు కడప జిల్లాకు చెందిన రఘునాథ్ రెడ్డి కంపెనీల్లోనే జరుగుతున్నాయి. ఎక్సెల్ రబ్బర్ ప్రైవేట్ లిమిటెడ్, సైబర్ స్పేర్ ఐటీ సర్వీసెస్, విలాస్ పాలిమార్, యేస్ టైర్స్ లో వీరు భాగస్వాములుగా ఉన్నారు. అయితే.. కాంగ్రెస్ నేత అనిరుథ్ బంధువుల ఇళ్లలో కూడా సోదాలు జరిగాయి. తెలంగాణలో భారీగా భూములు ఉన్న రఘునాథ్ రెడ్డి.. ఎవరికైనా లీజ్ కి ఇచ్చారా..? రియల్ ఎస్టేట్ కంపెనీలో జరుగుతున్న ఆర్థిక లావాదేవీలే.. ఐటీ రెయిడ్స్ కు కారణమా? అనేది తెలియాల్సి ఉంది. అనిరుథ్ రెడ్డి.. కోమటిరెడ్డి కుటుంబానికి సన్నిహితంగా ఉండటంతో రాజకీయ నేపథ్యం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రబ్బరు కంపెనీలో లెక్కలు పర్ఫెక్ట్!
1988లో ప్రారంభమైన కంపెనీ ఎక్సెల్ లో ఆడిటింగ్, ట్యాక్స్ చెల్లింపులు కచ్చితంగా ఉన్నాయి. కానీ, వాటి సిస్టర్ సంస్థలైన ఇన్ఫ్రా కంపెనీల ఎఫెక్ట్ ఇటువైపు పడినట్లు తెలుస్తోంది.