మెఘా కృష్ణారెడ్డి ఇంట్లో ఐటీ తనిఖీలు మూడు రోజుల వరకు కొనసాగే అవకాశం
కృష్ణారెడ్డి నివాసంలో కేంద్రం నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు
ఈ బృందాలకు సహకరిస్తున్న లోకల్ ఐటీ అధికారులు
దాదాపు 20 మంది ఐటీ అధికారులతో క్షుణ్ణంగా ఫైల్స్ పరిశీలన
అందర్నీ ఆశ్చర్యపరుస్తున్న మూడు రోజుల తనిఖీలు
కనీవినీ ఎరుగనంత అక్రమ ఆస్తులు వుండచ్చునని అంచనా
హైదరాబాద్: మెఘా కృష్ణారెడ్డి ఐటీ దాడుల వ్యవహారం ఇప్పట్లో తేలేదిగా కనిపించడం లేదు. కనీసం మూడు రోజుల పాటు ఈ దాడులు కొనసాగుతాయని సమాచారం. కేంద్రం నుంచి ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగడంతో పెద్దమొత్తంలో నగదు, బంగారం వుండవచ్చునని భావిస్తున్నారు. ఈమధ్య కాలంలో ఎక్కడా కూడా వరుసగా మూడురోజుల పాటు తనిఖీలు జరిగిన దాఖలాలు లేవు. రెండు రాష్ట్రాలను తన కనుసన్నలలో వుంచుకోవడంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాలకు క్రమక్రమంగా విస్తరిస్తున్న మెఘా సంస్థపై కేంద్రం ఫోకస్ పెట్టింది. మీడియా సంస్థలను గుప్పిట్లో వుంచుకోవడం వెనుక గూడుపుఠాణి ఏమిటో అర్ధమై కేంద్రం మెఘా వ్యవహారంపై పూర్తి స్థాయి దర్యాప్తుకు పూనుకున్నట్టు చెబుతున్నారు. రాజ్యాంగ సంస్థలన్నీ ఒక్కొక్కటిగా రంగంలోకి దిగుతాయని అంటున్నారు.