కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు, సబ్-కాంట్రాక్టర్ల కంపెనీలు, ఇండ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దాదాపు 20కి పైగా బృందాలతో ఐటీ అధికారులు ఏకకాలంగా హైదరాబాద్, కరీంనగర్ లలో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇటు డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మిస్తున్న కాంట్రాక్ట్ సంస్థల్లోనూ ఈ సోదాలు కొనసాగుతున్నాయని ఐటీ వర్గాల సమాచారం. పన్ను చెల్లింపుల్లో భారీగా వ్యత్యాసాలుండటమే కారణమని… అందుకే ఐటీ నజర్ పడినట్లు తెలుస్తోంది.