డోలో 650 టాబ్లెట్స్ ఇప్పుడు ఎంత ఫేమస్ అంటే.. డాక్టర్లు చెప్పక్కర్లేదు. ఎవరికైనా జ్వరం అని డౌట్ వస్తే చాలు..చదువుకోని వాళ్లు కూడా వేసేసేకునే పరిస్థితి. ఎందుకంటే కొవిడ్ -19 పుణ్యమా అని దేశంలో..ఇంకా చెప్పాలంటే ప్రపంచంలో డోలో గోలీలను చూడని ఇల్లు లేదని చెప్పొచ్చు.
ఇక డోలో బిజినెస్ ఎన్ని వేల, లక్షల కోట్లకు చేరి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాక్స్ ఎగ్గొట్టిన బెంగుళూరుకు చెందిన డోలో650 తయారీ కంపెనీ మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్ కంపెనీపై ఆదాయపు పన్నుశాఖ అధికారులు దాడులు నిర్వహించారు.
ఐటి రెయిడ్స్ లో భాగంగా ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లు, బ్యాలన్స్ షీట్లు, బిజినెస్ పంపిణీదారులకు సంబంధించిన వివరాలు అన్నీ తనిఖీ చేస్తున్నారు. అలాగే మరికొన్ని నగరాలు, పట్టణాల్లో ఉన్న కంపెనీకి సంబంధించిన భవనాల్లోనూ ఏకకాలంలో ఐటి దాడులు కొనసాగుతున్నాయి.
తమ కంపెనీ దేశవ్యాప్తంగా 17 చోట్ల తమ ఫార్మా ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్ కొనసాగుతోందని వెల్లడించింది. అలాగే విదేశాల్లోనూ కొన్నిచోట్ల తమ ఉత్పాదన ఉందని తెలిపింది.
మైక్రోల్యాబ్స్ ప్రధాన తయారీ డోలో650, అమ్లాంగ్, ల్యూబ్రెక్స్, డయాప్రైడ్, విల్డాప్రైడ్, ఒల్ మాట్, అవాస్,ట్రైప్రైడ్, బాక్టోక్లవ్, టెనెప్రైడ్-ఎం, ఆర్బిటెల్ అని సంస్థ తెలియచేసింది. అయితే వీటిల్లో డోలో మాత్రం ప్రముఖంగా కొవిడ్ సమయంలో వచ్చే ఒళ్లు నొప్పులు, జ్వరం, తలనొప్పి వంటివి తగ్గటం కోసం గత రెండేళ్లలో డాక్టర్లు విరివిగా ప్రిస్క్రైబ్ చేయగా, అటు మందుల దుకాణాల్లోనూ వీటి అమ్మకాలు జోరుగా కొనసాగాయి.