టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పేరుతో సంచలనం సృష్టించిన అమ్మడు శ్రీ రెడ్డి. తనను లైంగికంగా వాడుకున్నారంటూ ఆరోపణలు చేస్తూ అగ్ర హీరోల దగ్గర నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ వరకు అందరిని ఒక ఆట ఆడించింది. తాజాగా టాలీవుడ్ పై ఐటి కన్నుపడిన సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తో పాటు హీరో నాని ఇంట్లో ఐటి అధికారులు సోదాలు చేశారు.
విది విచిత్రమో వింత నాటకమో తెలియదు కానీ, అప్పట్లో శ్రీరెడ్డి సురేష్ బాబు చిన్న కొడుకు అభిరామ్ తో డేటింగ్ చేసిన సంగతి తెలిసిందే. మరో వైపు తనని లైంగికంగా నాని వాడుకున్నాడని కూడా శ్రీరెడ్డి ఆరోపణలను చేసింది. ఇప్పుడు అదే ఇద్దరి మీద ఐటి అధికారులు సోదాలు చెయ్యటంతో శ్రీ రెడ్డి సోషల్ మీడియా లో పోస్ట్ పెట్టింది. సురేష్ బాబు గారు దేవుడు ఉన్నాడు, మోడీజీ థాంక్స్ అంటూ పోస్ట్ చేసింది. మరి శ్రీ రెడ్డి శాపం వల్లే ఐటి అధికారులు సోదాలు చేశారా లేక అనుకోకుండా శ్రీ రెడ్డి కి పడనివాళ్లపై దాడులు జరిగాయా అనేది నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారింది.