అదిలాబాద్ పట్టణానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త రఘునాథ్ మిత్తల్ నివాసం, వ్యాపార సముదాయాలలో నిన్నటి నుండి ఆదాయపన్ను శాఖ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహిస్తున్నారు. మిత్తల్‌కు చెందిన సాయిబాబా జిన్నింగ్, ప్రెస్సింగ్ ఫ్యాక్టరీలతో పాటు తన నివాసంలో ఏకకాలంలో సోదాలు నిర్వహించి పలు కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనపర్చుకున్నారు. ఆదిలాబాద్‌లో పేరుపొందిన వ్యాపారవేత్తగా గుర్తింపు పొందిన రఘునాథ్ మిత్తల్‌కు సంబంధించి అదిలాబాద్ లో నాలుగు పత్తి ఆధారిత పరిశ్రమలు, రియల్ ఎస్ట్టేట్ వ్యాపారం, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో భారీ ఎత్తున వ్యాపారాలు సాగిస్తున్నట్టు ఐటి అధికారులకు సమాచారం అందింది. ఐటీ సోదాలకు సంబంధించి అధికారులు మీడియాకు కూడా అనుమతి ఇవ్వకుండా సోదాలు చేయడము చర్చనీయాంశంగా మారింది.