ప్రముఖ నటుడు సోనూసూద్ ఇంటిపై మూడో రోజు ఆదాయపు పన్నుశాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయన ఇండ్లు, కార్యాలయాలపై ఏక కాలంలో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి.
మూడో రోజు ముంబై, నాగపూర్, జైపూర్, లక్నోల్లో తన ఇండ్లు ఆఫీసులపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయనకు ఆదాయం ఎక్కడెక్కడ నుండి వస్తుంది, అకౌంట్ల వివరాలు, తన లావాదేవీలతో పాటు ఆయన ఆస్తుల గురించి పరిశీలన కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
సోనూసూద్ పై ప్రతీకారంగానే ఐటీ రైడ్స్ జరుగుతున్నాయంటూ ఆయన అభిమానులు ట్విట్టర్ లో #IstandWithSonuSood ను ట్రెండింగ్ లోకి తీసుకొచ్చారు.
సోనూసూద్ కరోనా కష్టకాలంలో ఎంతోమంది నిరుపేదలు, విద్యార్థులు, మహిళలకు అండగా ఉంటే ప్రభుత్వాలు ఇచ్చే మర్యాదలు ఇవేనా అంటూ అభిమానులు మండిపడుతున్నారు.