సంగారెడ్డిలోని తెల్లపూర్‌లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి నివాసంలో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఆయన నివాసంతో పాటు ఆయనకు చెందిన రాజ్‌పుష్ప, వర్టెక్స్, ముప్పా సంస్థల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. మొత్తం ఐదు వాహనాల్లో వచ్చిన అధికారులు 50 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.
అధికారులు మొత్తం ఐదు బృందాలుగా విడిపోయి తనిఖీలు చేస్తున్నారు. ఈ రోజు మొదట మసుధ ఫార్మాకంపెనీలో తనిఖీలు చేసినట్టు తెలుస్తోంది. వెంకట్రామి రెడ్డికి సంబంధించిన కంపెనీ ఆడిట్లను అధికారులు పరిశీలిస్తున్నారు.
వర్టెక్స్ కంపెనీలో కొందరు బీఆర్ఎస్ నేతలు భాగస్వాములుగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. గత ఐదేండ్ల ఆదాయ పన్ను రిటర్న్స్ పై విచారిస్తున్నారు. భారీగా పన్నులు ఎగవేసినట్టు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.