నగరంలో రెండోరోజు ఐటీ సోదాలు జరిగాయి. బుధవారం కేఎన్ఆర్ కన్‌స్ట్రక్షన్ కంపెనీలో తనిఖీలు జరిపిన అధికారులు.. గురువారం పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు.
రాష్ట్రంలోని వరంగల్, ములుగు, జనగామతో పాటు.. హైదరాబాద్ లోని ఆరు చోట్ల దాడులు చేపట్టారు. అందులో భాగంగా విలువైన డాక్యుమెంట్లు, నగదును అధికారులు స్వాధీనం చేసుకొని సీజ్ చేసినట్టు తెలుస్తోంది.
మల్లన్నసాగర్, కొండపోచమ్మ ప్రాజెక్ట్, కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో కేఎన్ఆర్ కంపెనీ భాగస్వామ్యం ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.
పలు ప్రాజెక్ట్ ల ఖర్చులు.. వాటికి సంబంధించిన పత్రాలను తనిఖీ చేస్తున్నట్టు స్పష్టం చేశారు అధికారులు.