కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో రెడ్ కార్పెట్ పై అందాల నటీ పూజా హెగ్డే తళుక్కుమన్నారు. పింక్ కలర్ స్ట్రాప్ లెస్ డ్రెస్సులో కనిపించిన ఆమెను చూసి అంతా తమ చూపును తిప్పుకోలేకపోయారు.
పూజా హెగ్డే తాజాగా ఓ విషయాన్ని వెల్లడించారు. ఫిల్మ్ ఫెస్టివల్ కు వచ్చే సమయంలో తాను తన లగేజీని పోగొట్టుకున్నట్టు తెలిపారు. అందులో ఫిల్మ్ ఫెస్టివల్ కోసం తెచ్చుకున్న ఔట్ ఫిట్స్, హెయిర్, మేకప్ ప్రోడక్టులు ఉన్నట్టు చెప్పారు.
ఇండియా నుంచి తాను లగేజితో బయలు దేరానని, ప్యారీస్ లో కనెక్టింగ్ ఫ్లైట్ ఎక్కుతుండగా బ్యాగ్ మిస్ అయిందని ఆమె వివరించారు. అయితే బ్యాగ్ పోయినందుకు తాము ఏమీ బాధపడలేదన్నారు. ఎందుకంటే ఆసమయంలో అంత టైమ్ కూడా తమ వద్ద లేదన్నారు.
తన టీమ్ తో పాటు తాను షాపింగ్ కు వెళ్లి మళ్లీ కొత్త హెయిర్ ప్రోడక్ట్స్, కొత్త మేకప్ కిట్, కొన్ని జ్యుయెల్లరీ తీసుకుని వచ్చామన్నారు. ఆ రోజు తాను అర్ధరాత్రి సమయంలో భోజనం చేయాల్సి వచ్చిందన్నారు.