విమానంలో సిబ్బంది పై దాడి చేయడంతో పాటు నానా హంగామా చేసిన మహిళను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన విస్తారాకు చెందిన అబూదాబి- ముంబై విమానంలో పావ్ లో పెరుసియో అనే 45 ఏళ్ల మహిళ ఎకానమీ క్లాస్ టికెట్ తీసుకొని బిజినెస్ క్లాస్‌లో కూర్చుని హంగామా చేసింది. ఆమెను విమాన సిబ్బంది అడ్డుకోవడానికి ప్రయత్నించారు.
అంతేకాకుండా ఆమె విమానంలో అర్థనగ్నంగా పరేడ్ చేసినట్లు విమాన సిబ్బంది ఆరోపించారు. క్యాబిన్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. మహిళ ప్రవర్తన సరిగా లేని కారణంగా.. కెప్టెన్ ఆమెకు వార్నింగ్ ఇచ్చారని, ఎంతకీ వినకపోవడంతో ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
ఇతర కస్టమర్ల భద్రత దృష్ట్యా విమానంలో రెగ్యులర్‌గా అనౌన్స్‌మెంట్ చేశారని, సంస్థ మార్గదర్శకాల ప్రకారం భద్రతా దళాలకు ఈ విషయాన్ని చేరవేసినట్లు విస్తారా సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఘటనకు చెందిన ఇతర వివరాలను ఆ సంస్థ షేర్ చేయలేదు.
ఇటీవల విమానాల్లో ప్రయాణికులు దురుసుగా ప్రవర్తిస్తున్న విషయం తెలిసిందే. దీంతో గత ఏడాది నుంచి ఇండియాలో విమాన సంస్థలు ప్రయాణికులు ప్రత్యేకంగా నిఘా పెడుతున్నాయి.