సముద్ర మట్టానికి 15 వేల ఫీట్ల ఎత్తులో ఉన్న ఉత్తరాఖండ్‌లోని హిమాలయ శిఖరాల్లో ఐటీబీపీ జవాన్లు యోగా శిబిరాన్ని నిర్వహించారు. అంతేకాదు, ఎముకలు కొరికే చలి ఉన్నప్పటికీ, శీతల గాలులు వీస్తున్నప్పటికీ ఏ మాత్రం వెనుకంజ వేయకుండా యోగాసనాలు వేస్తున్నారు.
8వ అంతర్జాతీయ యోగా దినోత్సవం కోసం దేశవ్యాప్తంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులు కూడా యోగా డే కోసం ముందస్తుగా సన్నాహాలు చేసుకుంటున్నారు.
ఇందులో భాగంగా యోగాసనాలను ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇక గతేడాది, హిమవీరులు.. లద్దాఖ్‌లోని 18 వేల అడుగుల ఎత్తులో ఉన్న పర్వతంపై యోగా చేశారు.
2015 నుంచి ప్రతియేట.. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచ దేశాలు జరుపుకుంటున్నాయి. ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ఈ రోజుకు ఆయా ప్రత్యేకతలు ఉన్నాయి. అలాగే, ఎక్కువ పగటి సమయం ఉన్న రోజుగా గుర్తింపు పొందడంతో అదే రోజును అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది.
#WATCH Gearing up for the forthcoming International Day of Yoga- 2022, Indo-Tibetan Border Police (ITBP) personnel are practicing Yoga at 15,000 feet in Uttarakhand Himalayas in snow and windy conditions around
(Source: ITBP) pic.twitter.com/tlim1jwqAH— ANI (@ANI) May 16, 2022
Advertisements