యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రేక్షకుల ముందుకు సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా ఈ సినిమాలో బాలయ్య సరసన నటించే హీరోయిన్ ఎవరు అనే చర్చలు బాగానే జరిగాయి. అయితే ఎట్టకేలకు పూర్ణ ను ఫైనల్ చేశారు.
తాజాగా ఈ సినిమాలో బాలయ్య సరసన ఓ ఐటెం సాంగ్ లో చిందులు వేసేందుకు ఎవరిని తీసుకోవాలనే ఆలోచనలో పడ్డాడట బోయపాటి. ఇప్పటికే స్టార్ హీరోయిన్ లను ఆ సాంగ్ కోసం బోయపాటి సంప్రదించారట. కానీ ఎవరు కూడా అందుకు ఓకే చెప్పలేదట. హీరోయిన్ గా పూర్ణ ను పెట్టుకున్న బోయపాటి.. ఐటెం సాంగ్ కోసం మాత్రం పేరున్న హీరోయిన్ ని తీసుకురావాలని మొదటినుంచి భావిస్తున్నాడట. ప్రస్తుతం మోనాల్, అప్సర రాణి ఐటెం సాంగ్స్ కోసం పచ్చజెండా ఊపుతున్నారు. మరి బోయపాటి స్టార్ హీరోయిన్స్ కోసం ఎదురుచూస్తాడా లేక వీరితో సరిపెట్టుకుంటాడా చూడాలి.