ఈ రోజు హైదరాబాద్లో.. రెండు వింతలు చోటు చేసుకున్నాయి. వింతలను చూడ్డానికి ఎగబడ్డ జనం… వాటిని తమ ఫోన్ కెమెరాల్లో బంధించి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసి… రకరకాల కామెంట్లను చేయడంతో ఈ వింతలు బాగా వైరల్ అవుతున్నాయి. ముందు హైదరాబాద్ లో ఒక గ్రహం మాదిరిగా ఉన్న ఆకారం దర్శనమిచ్చింది. తెలుపు రంగులో ఉన్న ఈ వింత ఆకారాన్ని చూసి జనాలు షాక్ అయ్యారు. అది గ్రహమా.. లేక ఏదైనా నక్షత్రమా అన్న చర్చ సోషల్ మీడియా వేదికగా సాగింది. లేదంటే ఏలియన్ షిప్ ఏమైనా భూమిని సమీపించిదా.. అన్నా సందేహం కూడా వచ్చింది.
కొందరు ఇది మార్స్ గ్రహం అని , స్టార్ అని, ఏలియన్ అని.. ఇలా రకరకాలుగా ఊహాగానాలొచ్చాయి. ఇక ఇలా ఉంటే..వికారాబాద్ జిల్లా ,మర్పల్లి మండలం, మొగిలిగుండ్లలో ఓ వింత శకటం ప్రత్యక్షమైంది. ఆదిత్య 369సినిమాలో ఉన్నట్టు గుండ్రని భారీ శకటం ఎక్కడ నుంచో వచ్చి పంటపోలాల్లో పడింది. దీంతో స్థానికులు దాన్ని చూడ్డానికి ఎగబడ్డారు.
శకటం చుట్టూ కెమెరాలుండి..పెద్దగా ఉండడంతో.. భయాందోళనలకు గురైన గ్రామస్తులు అధికారులకు సమాచామిచ్చారు.
అయితే..అది గ్రహం కాదని..స్టార్ కాదని.. ఏలియన్ అస్సలు కాదని శాస్త్రవేత్తలు తేల్చేయడం అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అది వెదర్ రీసెర్చ్ బెలూన్ గా తేల్చారు సైంటిస్టులు. వాతావరణ పరిస్థితులను అంచనా వేయడానికి ప్రయోగించిన హీలియం బెలూన్ అని..దీని బరువు వెయ్యి కేజీలని చెప్పారు.