ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణాలో అవినీతి జరుగుతోందని, కేసీఆర్ మాటలు చేష్టలు చూస్తుంటే మహ్మద్ తుగ్లక్ గుర్తొచ్చారని యద్దేవాచేసారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో విడిపోయిన తర్వాత ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణాని అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని కితాబిచ్చారు. టీఆర్ఎస్ పార్టీ ప్రజల విశ్వాసం కోల్పోయిందని..కాంగ్రెస్ పార్టీ ప్రజాసమస్యల్ని గాలికొదిలేసిందని..కనుక తెలంగాణాలో బీజేపీ అధికారంలోకి వస్తుందనే నమ్మకముందని ధీమావ్యక్తం చేసారు.
“ 1956 లోనే ప్రత్యేక తెలంగాణ కోసం నా తండ్రి మర్రి చెన్నారెడ్డి కేంద్రాన్ని ఎదిరించారు. ప్రపంచం మొత్తానికి తెలంగాణా గురించి తెలియజేసిన వ్యక్తి మర్రి చెన్నారెడ్డి. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్,బీజేపీల మధ్యేపోటీ ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు.ఇద్దరు ఎంపీలున్న బీజేపీ..ఇప్పుడు అత్యధిక స్థానాలు గెలిచి దేశాన్ని పాలిస్తోంది. టీఆర్ఎస్ ప్రజల విశ్వాసం కోల్పోయింది.” –మర్రిశశిధర్ రెడ్డి, బీజేపీనేత