రాష్ట్రంలో మద్యం ధరల పెంపులో కేసీఆర్ కుటుంబం స్వలాభం ఉందా…? సడన్‌గా రేటు పెంచటంలో కుంభకోణం దాగి ఉందా…? మద్యం ధరల పెంపు వెనుక మాఫియా హస్తం ఉందా…? అంటే అవుననే అంటున్నారు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి.
రాష్ట్రంలో కల్వకుంట్ల సేల్స్ టాక్స్-కెఎస్‌టీ అమలవుతోందని, ఆరు శాతం కమీషన్ అప్పజెప్పితేనే రాష్ట్రంలో ఏపనైనా జరుగుతోందని ఆరోపించారు ఎంపీ రేవంత్ రెడ్డి. మద్యం ధరల పెంపు వ్యవహరంలో ఓ ఎంపీ చెన్నై, ఢిల్లీలో మకాం వేసి బేరం కుదిర్చాడని సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై సీబీఐ విచారణ చేస్తే మొత్తం వ్యవహారం బయటపడుతుందని… లేదంటే తాము కోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ఎక్సైజ్ అండ్ ప్రోహిబిషన్ శాఖ కాస్త ఎక్సైజ్ అండ్ ప్రమోషన్ శాఖగా మారిపోయిందని, మద్యాన్ని పోత్సహిస్తూ మహిళల భద్రతలో ప్రభుత్వం రాజీపడుతుందని విమర్శించారు. ఇంత ధరలకు అమ్ముతుంటే వినియోగదారుల ఫోరం ఏం చేస్తుందని ప్రశ్నించిన ఆయన… లాటరీ జూదం అని, అదే లాటరీ పద్ధతిలో షాపులు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. షాపు రాని వారికి డబ్బు వాపస్ ఇవ్వకపోవటం నేరమన్నారు. కేంద్రం జోక్యం చేసుకోకుంటే… కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు రేవంత్ రెడ్డి.
ఎన్‌కౌంటర్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
కవితను టెన్షన్ పెడుతోన్న సీఎం కేసీఆర్..?
ఫ్లైఓవర్ డిజైన్ లోపంతోనే ప్రమాదాలు…!
ఈమేరకు ఎంపీ రేవంత్ రెడ్డి రాష్ట్ర ప‌్రజలకు బహిరంగ లేఖ రాశారు.