కింగ్ నాగార్జున 61వ బర్త్ డే జరుపుకుని 62లోకి అడుగు పెట్టారు..కుటుంబ సభ్యులు ,అభిమానులు, శ్రేయోభిలాషులు, సినిమా ప్రముఖులు ఎందరో నాగ్ బర్త్ డే కి విషెస్ చెప్పారు..తనను విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తూ ఒక వీడియో పోస్ట్ చేసారు నాగ్..ఆ వీడియో తను 31వ బర్త్ డే జరుపుకున్నాని అనడం చర్చనీయాంశం అయింది..
ఇవాళ నేను 31వ బర్త్ డే జరుపుకున్నాను.నాకు విష్ చేసిన అందరికి థాంక్యూ..సుమారు ఐదునెలల తర్వాత మళ్లీ స్క్రీన్ పై కనపడబోతున్నాను..బిగ్ బాస్ షోలో కలుద్దాం అంటూ ట్విట్టర్లో వీడియో పోస్ట్ చేసాడు..31వ బర్త్ డే జరుపుకున్నాను నాగ్ ఏ ఉద్దేశ్యంతో అన్నారో కానీ నాగార్జునని చూస్తే అది నిజమే అనిపిస్తుంది.. ఎవరికయినా పుట్టినరోజుల సంఖ్య పెరుగుతుంటే వయసు మీదపడుతున్నట్టు.. నాగ్ విషయంలో అది 30ఇయర్స్ దగ్గరే ఆగిపోయిందో మరి రివర్స్ లో వస్తుందో ??..
కొడుకులు హీరోలుగా వచ్చాక కూడా ఇంకా యంగ్ హీరోగా ఉండడం నాగ్ కే చెల్లింది..ఎంతైనా మన్మధుడు పేరుకి పూర్తి న్యాయం చేస్తున్నారు..మొన్న నాగ్ బర్త్ డే రోజు వర్మ పెట్టిన విషెస్ కూడా ఇదే విషయాన్ని చెప్తున్నాయి..ఏమయ్యా నాగార్జున ఏం తింటున్నావ్, నీ వయసు పెరుగడం ఆగిపోయినట్టుంది ,ఆ సీక్రెట్ ఏంటో మాకు చెప్పూ అని ట్వీట్ చేశాడు ఆర్జివి..
ఇప్పుడు నాగ్ వీడియో 31అని ప్రస్తావించడంతో చాలామంది నెటిజన్లు నిజమే సర్ మీరు బిలౌ 30అన్నా కూడా నమ్మేసేలా ఉన్నాం, అసలు అలా ఎలా మెయింటెయిన్ చేస్తున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు..చై,అఖిల్ కాదు, చై పిల్లలు హీరోలుగా వచ్చాక కూడా నాగ్ అంతే అందంగా ఉంటాడు అని మరో అభిమాని కామెంట్..ఇంతమంది అభిమానాన్ని సొంతం చేసుకున్న, మన్మధుడి హెల్త్ సీక్రెట్ ఏంటో??
Watch Video:
So much love, so many blessings🙏 I am overwhelmed!!thank you especially to all the senior Akkineni fans and the juniors, thank you to all the industry friends And of course thanks to all my friends!❤️ pic.twitter.com/O0gEPXgLaS
— Nagarjuna Akkineni (@iamnagarjuna) August 29, 2020