అహ్మదాబాద్‌లోని పార్క్‌లో ఏకశిల ప్రత్యక్షమైందని సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ వచ్చిన వార్తలు చివరికి అబద్ధమని తేలాయి. ఆ లోహపు శిలను పార్క్ యాజమాన్యమే పాతిపెట్టినట్టుగా తేలింది. సందర్శకుల కోసం ఆ నిర్మాణాన్ని ఏర్పాటు చేసినట్టు వివరించింది. పార్క్‌కు వచ్చినవారు తమ ప్రతిబింబాన్ని అందులో చూసుకోవచ్చని తెలిపింది.
ప్రపంచంలోని 30కి పైగా నగరాల్లో ఇటీవల ఏకశిలలు ప్రత్యక్షమై.. మళ్లీ కొద్ది రోజులకే అదృశ్యమయ్యాయి. ఈ విషయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీంతో ఉన్నట్టుండి అహ్మదాబాద్‌లో కూడా రాత్రికి రాత్రి శిల ప్రత్యక్షం కావడంతో.. ఇది కూడా అలాంటిదేనని సందర్శకులు అపోహపడ్డారు. సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు షేర్ చేయడంతో… దేశమంతా హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న పార్క్ యాజమాన్యం.. ఆ ఏక శిలను ఏర్పాటు చేసింది తామేనని స్పష్టం చేసింది.