అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మొదటి భార్య ఇవానా మృతిపై వైద్యులు మెడికల్ రిపోర్టు ఇచ్చారు. మొండెం భాగానికి బలమైన గాయాలు అయ్యాయని, అందువల్ల ఇవానా మృతి చెందారని మెడికల్ ఆఫీసర్ రిపోర్టు ఇచ్చారు.
ఘటన ఎప్పుడు జరిగిందనే విషయాన్ని ఆయన తన రిపోర్టులో పేర్కొనకపోవడం గమనార్హం. ప్రమాదం జరగడం వల్లే ఆమె మరణించారని ఆయన ధ్రువీకరించారు.
ఇవానా ట్రంప్ గురువారం మృతి చెందారు. న్యూయార్క్ లోని తన స్వగృహంలో ఆమె తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని డోనాల్ట్ ట్రంప్ తన సోషల్ మీడియా సంస్థ ట్రుత్ ద్వారా వెల్లడించారు. ఇవానా ట్రంప్ మరణ వార్తను తెలియజేయడానికి తాను చాలా బాధపడుతున్నానని చెప్పారు.
ఆమె అద్భుతమైన, అందమైన మహిళ అని, గొప్ప , స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని ఆమె గడిపారని ఆయన చెప్పారు. మరోవైపు ఇవాంకా ట్రంప్ కూడా ట్వీట్ చేశారు. తన తల్లి మరణ వార్త విని తన హృదయం పగిలిపోయిందంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. మెట్లపై నుంచి ఇవానా పడిపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి.