లవ్, ఎమోషన్స్‌ను పండించే శర్వానంద్-సమంత కలిసి నటించిన తమిళ్ 96సినిమా రీమేక్ జాను. తమిళ్‌లో అద్భుతమైన హిట్ అందుకోవటంతో నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను తమిళ్ దర్శకుడు ప్రేమ్‌కుమార్‌తోనే తెలుగులో సినిమా తీశాడు.
ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన జాను సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంటుండగా.. శర్వా-సామ్ సినిమాకు, కథకు జీవం పోశారని చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ కాస్త స్లోగా అనిపించినా… శర్వా ఫ్లాష్‌బ్యాక్ సీన్స్ అద్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా స్కూల్ డేస్‌లో లవ్ స్టోరీస్‌లో ప్రతి ఒక్కరు తమ కథను గుర్తుకు తెచ్చుకునేలా సీన్స్ ఉంటాయనటంలో ఎలాంటి సందేహం లేదు. సినిమా కథ కాస్త స్లోగా సాగినా… సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మంచి ప్లస్ అయినట్లు కనపడుతుంది.
ఇక సమంత ఎంటరయ్యాక సినిమా మరింత సూపర్‌గా ఉంటుంది. సెకండ్ హఫ్ సినిమాను నిలబెడుతుంది. రీమేక్ మూవీ అయినప్పటికీ 96లో చిన్న చిన్న మార్పులు చేసి తెలుగు ప్రేక్షకులకు సరిపోయేలా సినిమా తీశారు. రామ్-జానుల ప్రేమాయణం అద్భుతంగా ఉంటుంది. సమంత, శర్వాలు తమ నటనను మరోసారి నిరూపించుకున్నారని చెప్పుకోవచ్చు. ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది.
టీజర్స్, ట్రైలర్స్ క్రియేట్ చేసిన అంచనాలను సినిమా అందుకుందని చెప్పుకోవచ్చు. తమిళ్ 96 సినిమా చూసిన వారంతా త్రిషను సమంతాతో, శర్వానంద్‌ను విజయ్ సేతుపతితో పొల్చుతారనటంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, మరోవారం వరకు పెద్ద సినిమాలు ఏమీ లేకపోవటం… వాలెంటెన్స్ వీక్‌తో సినిమా రిలీజ్ అవటం సినిమాకు ఖచ్చితంగా ప్లస్ కాబోతున్నాయి.