శర్వానంద్ సమంత జంట వస్తున్న సినిమా జాను. తమిళ్ లో సూపర్ హిట్ అయినా 96 మూవీ రీమేక్ గా వస్తున్న ఈ సినిమాను తెలుగు లో రీమేక్ రైట్స్ దిల్ రాజు తీసుకున్నారు. సినిమా ప్రారంభం నుంచి ఒక్క అప్డేట్ కూడా ఇవ్వని చిత్ర యూనిట్ ఇప్పుడు సినిమాకు సంబంధించి ఒక్కో అప్డేట్ రివీల్ చేస్తుంది. బుధవారం జాను సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ విడుదల చేసిన చిత్ర యూనిట్ తాజాగా టీజర్‌ను విడుదల చేసింది.
తమిళ్ లో 96 సినిమా తీసిన దర్శకుడు ప్రేమ్ కుమార్ జాను సినిమాకి కూడా దర్శకుడిగా పనిచేశాడు. విజయ్ సేతుపతి, త్రిష స్థానంలో శర్వానంద్, సమంతాలను పెట్టిన ప్రేమ్ కుమార్ అదే న్యాచురాలిటీ చూపిస్తూ తెరకెక్కించినట్టు తెలుస్తుంది. చిన్ననాటి పాత్రలతో సహా అదే స్క్రీన్ ప్లే ని దర్శకుడు తీసుకున్నట్టు తెలుస్తుంది. సమ్మర్ లో ఈ సినిమా విడుదలకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.
జాను టీజర్ ఇదే
Advertisements