శర్వానంద్ సమంత జంట గా వస్తున్న సినిమా జాను. తమిళ్ సూపర్ హిట్ అయిన 96 సినిమాకి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. తమిళ్ విజయ్ సేతుపతి, త్రిష నటించగా తెలుగు లో శర్వానంద్, సమంత నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్, లుక్స్ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. తాజా ఈ చిత్రం నుంచి ‘ది లైఫ్ ఆఫ్ రామ్ ఫుల్’ వీడియో సాంగ్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. తమిళ్ లో 96 సినిమాకు దర్శకత్వం వహించిన ప్రేమ్ కుమార్ జాను సినిమాకి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 7 న ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రానుంది.