బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ ఓ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ అనసూయ. బుల్లితెరపై తన అందంతో అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే వెండితెరపై కూడా తనదైన శైలిలో దూసుకుపోతోంది. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన రంగస్థలం సినిమా తో రంగమ్మత్త గా నటన పరంగా విమర్శకులను సైతం మెప్పించి తానేమిటో నిరూపించుకుంది. అయితే ప్రస్తుతం ఈ రంగమ్మత్త తమిళంలో అడుగుపెట్టేందుకు రెడీ అవుతుంది. అనసూయ నటిస్తున్న థాంక్యూ, బ్రదర్ సినిమాలు ఇంకా విడుదల కావాల్సి ఉన్నాయి. మరోవైపు కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగమార్తాండ, రవితేజ కిలాడి సినిమాలలో కూడా నటిస్తోంది.
ఇక తాజా సమాచారం ప్రకారం ఈ అమ్మడు తమిళంలో తన మొదటి సినిమాకు ఓకే చెప్పిందట. విజయ్ సేతుపతి హీరోగా చేస్తున్న ఈ సినిమాలో అనసూయ ఓ మంచి పాత్ర చేస్తుందట. ఈ సినిమాకు సంబంధించి ఓ ఫోటోను అనసూయ షేర్ చేసింది. మంచి కథతో కొత్త ప్రయాణం అంటూ ట్యాగ్ లైన్ కూడా రాసుకొచ్చింది. ఈ సినిమాలో అనసూయ సిల్క్ స్మిత పాత్ర చేస్తుందని సమాచారం.