జబర్దస్త్ ఫేమ్ యాంకర్ అనసూయ నెటిజన్లకు సెగలు పుట్టిస్తుంది. ఒకవైపు సినిమాలు, మరో వైపు బుల్లితెర షో లతో బిజీ బిజీ గా గడుపుతున్న అనసూయ కాస్త ఫ్రీ టైం దొరికితే నెట్టింట్లో హల్ చల్ చేస్తూ ఉంటుంది. తన ఫోటో షూట్ కు సంబంధించిన ఫొటోస్ ను పోస్ట్ చేస్తూ యూత్ కు మతులు పొగుడుతూ ఉంటుంది. తాజాగా నల్లరంగు చీర అనసూయ మెరిసింది. నల్లరంగు చీరలో వయ్యారంగా నిలుచుని ఫోజులిస్తూ అనసూయ పెట్టిన ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. అనసూయ అందానికి ఫిదా అయిన నెటిజన్లు కామెంట్స్ తో అనసూయను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.