బుల్లితెర యాంకర్ అనసూయ నటనతో మరో ఎత్తుకు ఎదిగిన సినిమా రంగస్థలం. సుకుమార్ దర్శకత్వంలో రాంచరణ్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో అనసూయ రంగమ్మత్త గా క్యరెక్టర్ వేసిన సంగతి తెలిసిందే. అయితే అప్పటివరకు గ్లామర్ రోల్ చేసే అనసూయ ఈ పాత్రతో తనలో ఉన్న నటన చూపించింది. విమర్శకులను సైతం మెప్పించింది అనసూయ.
ఇప్పుడు ఈ సినిమాకు ఫీల్మ్ ఫేర్ అవార్డు ల పంట పండింది. 2019 ఫీల్మ్ ఫేర్ అవార్డ్స్ లో ఉత్తమ నటుడిగా రాంచరణ్ కు అవార్డు రాగ, ఉత్తమ సహాయనటిగా అనసూయ అవార్డు గెలుచుకుంది. దేవీ శ్రీ ప్రసాద్ ఉత్తమ సంగీత దర్శకుడిగా.. చంద్రబోస్‌కు ఉత్తమ గేయ రచయితగా అవార్డులు వచ్చాయి.
మొత్తానికి అనసూయ నటనలో కూడా అవార్డు తెచ్చుకుంది. ప్రస్తుతానికి బుల్లితెర షో లను చేస్తున్న అనసూయ, చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో కూడా కీలకపాత్ర పోషించనుంది సమాచారం.