మాములుగా సెలబ్రిటీలపై నెట్టింట్లో నెటిజన్లు కామెంట్స్ చేస్తుంటారు. సెలబ్రిటీల ద్రుష్టి తమపై పడేందుకు కొంతమంది ఇంకొంచెం ఎక్కువగా కామెంట్స్ చేస్తుంటారు. మరికొంత మంది ఫేమస్ అవ్వటానికి బూతు కామెంట్స్ కూడా పెడుతుంటారు. అయితే సెలబ్రిటీలు అవ్వన్నీ పట్టించుకోకుండా ముందుకు వెళ్తుంటారు. కానీ హద్దుమీరి కామెంట్స్ చేస్తే కొన్ని సార్లు రియాక్ట్ అవ్వకతప్పదు. ఇప్పుడు జబర్దస్త్ ఫేమ్ అనసూయ కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొంది. ట్విట్టర్ వేదికగా కొంతమంది నెటిజన్లు అసభ్యకరంగా కామెంట్స్ చేస్తున్నారని ఆరోపిస్తూ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
అయితే ఇదే విషయమై అనసూయ మరో మారు స్పందించింది. నా పై కామెంట్స్ చేస్తున్నవాళ్లందరికి చెప్తున్నాను, ఇంతవరకు మీ జీవితాలు పోతాయని ఊరుకున్నాను, కానీ హద్దు మీరుతూ వ్యక్తిగతంగా కామెంట్స్ చేస్తున్నారు. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేశాను. కొంతమందికైనా శిక్ష పడితే మిగిన వాళ్ళు మారుతారు. ఇప్పటికైనా పాత ట్వీట్ లు డిలీట్ చెయ్యండి. లేదంటే మీరు కూడా విచారణకు హాజరు కాక తప్పదంటూ వార్నింగ్ ఇచ్చింది. మరి అనసూయ వార్నింగ్ కు ఎంతమంది నెటీజన్లు కామెంట్స్ చెయ్యకుండా ఉంటారో చూడాలి.