ఎప్పుడు సరదాగా నవ్వుతూ నవ్విస్తూ ఉండే సుడిగాలి సుదీర్ కొంత అసహనానికి గురైనట్లు తెలుస్తోంది. తనపై ఎన్ని పంచ్ లు వేసిన రివర్స్ పంచ్ లు లేదా, తన హావభావాలతోనే నవ్వించే సుధీర్ హైపర్ ఆదిపై సీరియస్ అయినట్లు సమాచారం. తాజాగా ఉగాది స్పెషల్ ప్రోగ్రాంలో హైపర్ ఆది ఎప్పటి లాగానే సుధీర్ పై పంచ్ వేశాడు. ఇక, తనను ఎవరు కామెంట్ చేసిన ఎప్పుడు లైట్ తీసుకొనే సుధీర్ ఈసారి మాత్రం కొంత అసహనం వ్యక్తం చేసినట్లు సుధీర్ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఇంతకీ విషయమేంటంటే…
హైపర్ ఆది ఎప్పటిలాగానే సుధీర్ ను ఉద్దేశించి రొమాంటిక్ యాంగిల్ తో మంచి మాస్ మసాలా పంచ్ వేశాడు. సుధీర్ ను టెలికాస్ట్ కాని పర్సనల్ ఈవెంట్స్ పెర్ఫార్మ్ చేస్తావా అంటూ హైపర్ ఆది కామెంట్ చేశారు. దీనికి సుధీర్ ఒక్కసారిగా హైపర్ ఆదిపై సీరియస్ అవుతూ.. తాను ఆది టీంమెంబర్ దొరబాబులా కాదని, అందరు ఆది జట్టు సభ్యుల్లా ఉండరని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సుధీర్ చేసిన ఈ వ్యాఖ్యలతో హైపర్ ఆది కుడా కొంత మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది.
ఇదివరకు ఎవరెన్ని పంచ్ లు వేసిన లైట్ తీసుకొనే సుధీర్ తాజాగా సీరియస్ అవ్వడంతో అక్కడున్న వారంతా షాక్ అయినట్లు సమచారం. ఇదిలా ఉండగా.. ఇటీవల సెక్స్ రాకెట్ లో హైపర్ ఆది టీంలోని దొరబాబు రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు దొరికిపోయాడు. ఇది ఆది టీంకు పెద్ద షాక్ అనే చెప్పాలి. ఆ వార్త బయటకు వచ్చాక అంత దొరబాబు ఇక ఆది టీంలో ఉండటం అనుమానమేనని అనుకున్నారు. ఈ క్రమంలోనే జబర్దస్త్ నిర్వహణ సంస్థ మల్లెమాల ప్రొడక్షన్ నుంచి అది టీంకు వార్నింగ్ ఇచ్చారని తెలుస్తోంది. జబర్దస్త్ లో ఆది, దొరబాబును రొమాంటిక్ తరహాలోనే చూపిస్తూఎంటర్ టైన్ చేసేవాడు. సెక్స్ రాకెట్ లో దొరబాబు పట్టుబడ్డాక అతను మొదటి నుంచి ఇలాంటివాడేనెమో అందుకే ఆది దొరబాబుపై అలాంటి పంచ్ లు వేస్తాడంటూ అంత అనుకున్నారు. ఈక్రమంలోనే హైపర్ ఆది అలాంటి కామెంట్స్ సుధీర్ పై చేయడంతో.. తనను కూడా దొరబాబుతో పోల్చినట్లు సుధీర్ ఫీలయినట్లు సమాచారం. దాంతోనే ఆదిపై సుధీర్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది.