జబర్దస్త్ కామెడీ షో నుంచి అదిరింది షోకు షిప్ట్ అయిన నాగబాబుపై జబర్దస్త్ జడ్జి రోజా పైచేయి సాధిస్తున్నారా..?నాగబాబు ఎగ్జిట్ ను రోజా సవాల్ గా తీసుకుందా..? ఎలాగైనా అదిరింది షోను ఢీకొట్టాలని రోజా ప్లాన్ చేసిందా..? నాగబాబు లేకపోయిన ఆ ప్రభావాన్ని జబర్దస్త్ పై పడకుండా చేయడంలో రోజా వర్కౌట్ అయిందా..?అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.
జబర్దస్త్ ఇన్నేళ్ల విజయవంతమైన ప్రయాణంలో ఈ కామెడీ షోకు జడ్జీలుగా కొనసాగిన నాగబాబు పాత్ర ఎంతో ఉందని అందరు అంటుంటారు. నాగబాబు జబర్దస్త్ కమెడియన్స్ ను ప్రోత్సహిస్తూ షోను మరింత వినోదాత్మకంగా మలచడంలో నాగబాబు సలహాలు, సూచనలు ఉన్నాయని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని కారణాల వలన జబర్దస్త్ తో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని తెంచేసుకున్నాడు నాగబాబు. ఆయన నిర్ణయం జబర్దస్త్ కమెడియన్స్ తోపాటు ఈ షో ప్రేక్షకులను కూడా షాక్ కు గురి చేసింది. ఇక నాగబాబుతోపాటు కొంతమంది జబర్దస్త్ కమెడియన్స్ చమ్మక్ చంద్ర, కిరాక్ ఆర్ఫీ, వేణు టీమ్ సభ్యులు జీ తెలుగులో ప్రసారం అవుతోన్న అదిరింది షోలోకి షిప్ట్ అయ్యారు.
అదిరింది షో నుంచి జబర్దస్త్ షోకు తీవ్రమైన పోటీ ఉంటుందని అంత భావించారు. ఇక ఈ రెండు షో లతో టీఆర్పి రేటింగ్ పేలుతుందని అనుకున్నారు. కొంతకాలం జబర్దస్త్ కు అదిరింది షో మంచి పోటీనే ఇచ్చింది. కానీ ఇటీవల అదిరింది షో టీఆర్పి రేటింగ్ క్రమంగా పడిపోతుందని వార్తలు వస్తోన్నాయి. జబర్దస్త్ మునుపటిలాగానే టీఆర్పి రేటింగ్ లో ముందంజలో ఉండగా.. కనీసం జబర్దస్త్ కు పోటీనిచ్చే స్థాయిలో కూడా అదిరింది షో లేదని అంటున్నారు.
ఇక, దీనికంతటికీ కారణం జబర్దస్త్ జడ్జి రోజానట. నాగబాబు ఎగ్జిట్ తో జబర్దస్త్ షో భారమంతా రోజాపనే పడిందట. కొంతకాలం జడ్జిగా రోజా ఒక్కరే ఉన్నారు. ఆ సమయంలో అంత నాగబాబు లేని లోటు మల్లెమాల యాజమాన్యానికి తెలిసి వస్తోందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కానీ రోజా ఒక్కరే జడ్జిగా ఉన్న నాగబాబు లేని లోటును ఎక్కడ కనిపించకుండా వ్యవహరించిందని ప్రశంసలను అందుకుంది. రోజా మాత్రం తన క్రేజ్ తో షోకి మంచి రేటింగ్ అందించారు. ఎక్కడా తగ్గకుండా జబర్దస్త్ అదే స్థాయిలో నడిపిస్తున్నారు…అంతేకాకుండా జబర్దస్త్ ఆర్టిస్టులను ప్రోత్సహించడంలో నాగబాబులాగానే ఎంకరేజ్ చేస్తోందట రోజా. దాంతో నాగబాబుపై రోజా పై చేయి సాధించిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.