జబర్ధస్త్‌కు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కామెడీ షోగా వచ్చిన జబర్ధస్త్‌ను ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా… జనం ఆదరించారు. యాంకర్ నుండి జడ్జెస్ వరకు, కంటెస్ట్ నుండి కామెంట్స్ వరకు జబర్ధస్త్‌కు టీం వర్క్‌గా ముద్ర పడింది. అందుకే జబర్ధస్త్‌ను కొట్టేందుకు ఎన్ని ప్రోగ్రామ్స్ వచ్చినా… జబర్ధస్త్‌కు వచ్చినంత క్రేజ్ కానీ, రేటింగ్ కానీ మరో షోకు రాలేదు.
అయితే, జబర్ధస్త్ జడ్జెస్ నాగబాబు, రోజా తప్పుకుంటున్నారని రెగ్యూలర్‌గా వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ ఈ సారి ఈ వార్తలు సీరీయస్ అని ఇంటా బయటా ప్రచారం సాగుతోంది. కేవలం జడ్జెస్ మాత్రమే కాదు యాంకర్ అనసూయ కూడా షోకు గుడ్‌బై చెప్పేసిందని… జబర్ధస్త్ హిట్‌లో కీలకంగా ఉన్న టీం లీడర్స్ చమ్మక్ చంద్ర, హైపర్ ఆదిలు కూడా నాగబాబు రూట్‌లో వెళ్లిపోతున్నారని తెలుస్తోంది.
ఇదే నిజమైతే… జబర్ధస్త్ షో పరిస్థితి ఏంటీ అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. అసలు జబర్ధస్త్ ఉంటదా…? ఉంటే కొత్త జడ్జెస్ ఎవరూ…? నాగబాబు, రోజాలలో ఎవరైనా తమ నిర్ణయం మార్చుకుంటారా…? ఇలా రకరకాల ప్రశ్నలతో ఇప్పుడు ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు.
జబర్ధస్త్ భవితవ్యం తేలాలంటే… ఎవరో ఒకరు నోరు విప్పాల్సిందే.