జబర్ధస్త్ తో వచ్చిన ఫేమ్ అంతా వ్యభిచారం ఇష్యూతో ఒక్కసారిగా మారిపోయింది. ఇక అంతే ఆ తర్వాత దొరబాబు ఎక్కడ కనపడ్డా తనపై వచ్చే సెటైర్లు అన్నీ ఇన్నీ కావు. పైగా ఆది కూడా తన స్కిట్ లో సెక్యూవల్ గానే టార్గెట్ చేస్తుండటంతో దొరబాబు అసలు క్యారెక్టర్ ఇదేనేమో అన్న అనుమానం మరింత బలపడిపోయింది. దొరబాబు అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్నాడన్న ప్రచారం అంతా ఇంతా కాదు.
అయితే, మొత్తం ఘటన తర్వాత దొరబాబు భార్య తనకు ఎంతో అండగా నిలబడిందని దొరబాబు తెలిపాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరు… తనను నిజంగానే నమ్మి అండగా నిలబడిందని తెలిపారు. యాంకర్ రవి షోకు భార్యతో కలిసి వచ్చిన దొరబాబు.. ఆనాటి విషయాలను గుర్తు చేసుకున్నాడు. ఆ రోజు ఏం జరిగిందో తనకు, తన భార్యకు తెలుసు అని.. ఇంకెవరికీ తను సమాధానం చెప్పుకోవాల్సి అవసరం లేదని చెప్పాడు. ఆ రోజు కానీ తన భార్య సపోర్ట్ లేకపోయుంటే ఈ రోజు ఇలా ఉండేవాడిని కాదని.. ఆమె దొరకడం తన అదృష్టం అంటు దొరబాబు ఎమోషనల్ అయ్యాడు.