ముక్కు అవినాష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. జబర్దస్త్ షో తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు ముక్కు అవినాష్. తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటారు. అయితే అవినాష్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న విషయం తెలిసిందే. అనూజ అనే అమ్మాయి తో అవినాష్ నిశ్చితార్థం మొన్ననే జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా తాజాగా మరో వీడియో ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అవినాష్.
మన జీవితంలోకి రైట్ పర్సన్ వచ్చినప్పుడు ఏ మాత్రం వెయిట్ చేయోద్దు. మా ఫ్యామిలీలు కలిసాయి. మేము కలిసాం. ఎంగేజ్‌మెంట్ కూడా అయింది. మీరు అందరు ఎప్పటి నుండో పెళ్లి ఎప్పుడు అని అడుగుతున్నారు. నా అనూజను త్వరలోనే చేసుకోబోతున్నాను. ఎప్పటిలానే మీ ఆశీర్వాదాలు ఉంటాయని కోరుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చారు.