జబర్దస్త్ కామెడీ షో తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు ఆటో రాంప్రసాద్. తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకుల ప్రేమాభిమానాలు పొంది బుల్లి తెర నుండి వెండితెరకు వరకు ఎదిగాడు. అయితే గతంలో సుడిగాలి సుధీర్, షకలక శంకర్ వంటి జబర్దస్త్ కమెడియన్స్ హీరోగా పరిచయం అయ్యారు. కాగా ఇప్పుడు రాంప్రసాద్ కూడా హీరోగా మారారు.
రాం ప్రసాద్ హీరోగా పీప్ షో అనే మూవీ ప్రేక్షకుల ముందు రాబోతుంది. ఈ సినిమాలో నేహా దేశ్ పాండే హీరోయిన్‌గా నటిస్తుంది. అలాగే క్రాంతి కుమార్ సీహెచ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. తాజాగా ఫస్ట్ లుక్ విడుదల చేసారు.