జబర్దస్త్ కామెడీ షో గురుంచి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఒంటరిగా ఫీల్ అవుతున్న సమయంలో మాజాను ఆస్వాదించడానికి జబర్దస్త్ ను వీక్షిస్తుంటారు చాలామంది. దీని బట్టి జబర్దస్త్ ప్రేక్షకులకు ఎంత వినోదాన్ని పంచుతుందో అర్ధం చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా.. కామెడీ ట్రాక్ తో నవ్వించే ఈ షో కాస్తా పొలిటికల్ ట్రాక్ ఎక్కిందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.
గతంలో జబర్దస్త్ షో కు వ్యాఖ్యాతలుగా రోజా, నాగబాబులు వ్యవహరించేవారు. అయితే ఇటీవల నాగబాబు ఈ షోకు గుడ్ బై చెప్పేసి మరో ఛానెల్ కు మారడంతో రోజాపైనే ఆ భారమంతా పడింది. కొన్నిరోజులపాటు రోజా ఒంటరిగానే జడ్జిగా వ్యవహరించింది. తరువాత హీరోలు కార్తికేయ, నిఖిల్, సాయిధరమ్ తేజ్ రోజాతో పాటు జడ్జిలుగా వ్యవహరించారు. అయితే వచ్చిన వీరంతా వారి వారి సినిమాలను ప్రమోట్ చేసుకునేందుకు వచ్చారు.
ఇక ఆ తరువాత పోసాని కృష్ణమురళి, అలీ జబర్దస్త్ కామెడీ షోకు జడ్జీలుగా వచ్చారు. రేపటి ఎపిసోడ్ లో కృష్ణ తనయుడు నరేష్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. అయితే వీరంతా చిత్ర పరిశ్రమకు చెందిన వారే అయినప్పటికీ… వీళ్లంతా వైసీపీ పార్టీకి చెందిన వారు కావడం గమనార్హం. అయితే రోజా సిఫార్స్ తోనే వీరంతా వ్యాఖ్యాతలుగా రావడానికి ఒప్పుకుంటున్నారని… పైగా పార్టీతో వీరికి అనుబంధం ఉండటంతో రోజా సూచనను కాదనలేకపోతున్నారని టాక్ వినిపిస్తోంది.
Advertisements