శ్రీలంకలో రోజు రోజుకి దారుణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోన్న శ్రీలంకలో ఆకలి కేకలు ఎక్కువ అవుతున్నాయి. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటడంతో ప్రజలు నిరసన బాట పట్టారు. ఈ క్రమంలో చాలా చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ప్రజాగ్రహం నేపథ్యంలో ఆదివారం క్యాబినెట్ మంత్రులందరూ మూకుమ్మడి రాజీనామా చేశారు. దీంతో లంకలో ఆర్థిక సంక్షోభానికి తాజాగా రాజకీయ సంక్షోభం తోడైంది.
అయితే, శ్రీలంక తాజా పరిస్థితులపై బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ స్పందించారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. శ్రీలంక సంక్షోభంపై ఏ ఒక్కరు కూడా తొందరపడి ఏదో ఒక అంచనాకు రావద్దని సదరు సందేశంలో జాక్వెలిన్ విజ్ఞప్తి చేశారు. శ్రీలంక జాతీయురాలిగా తన దేశాన్ని, దేశ ప్రజలను చూసి తన గుండె పగిలిందని ఆమె వ్యాఖ్యానించారు.
తన దేశంలో సంక్షోభం మొదలైన నాటి నుంచి ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి భిన్న వాదనలు వినిపించాయని ఆమె చెప్పుకొచ్చారు. కంటికి కనిపించదానినే నమ్మి ఈ సంక్షోభానికి కారణమంటూ ఏ ఒక్కరిని దూషించరాదని ఆమె విజ్ఞప్తి చేశారు.
‘ఒక శ్రీలంకన్‌గా, నా దేశం, దేశ ప్రజలు అనుభవిస్తుంది చూస్తుంటే హృదయవిదారకంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా నేను చాలా అభిప్రాయాలను విన్నాను. నేను చెప్పేదేమిటంటే, చూసిన దాని ఆధారంగా తొందరపడి తీర్పు ఇవ్వకండి.’ అని ట్విట్టర్ ద్వారా జాక్వెలిన్ విజ్ఞప్తి చేశారు.
As a Srilankan, it is heartbreaking to see what my country and countrymen are going through.
I have been flooded with a lot of opinions since this began from around the world. I would say, do not be too quick to pass a judgement and vilify any group based on what is shown. pic.twitter.com/7GXbkXOoBP
— Jacqueline Fernandez (@Asli_Jacqueline) April 4, 2022
Advertisements
కాగా, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ శ్రీలంక దేశీయురాలు. 2006లో మిస్ యూనివర్స్ శ్రీలంకగా ఎంపికైంది. 2009లో భారతదేశంలో అలాడిన్ అనే ఫాంటసీ డ్రామా కోసం ఆడిషన్ చేసింది. ఈ ప్రాజెక్టు ద్వారానే ఆమె నటిగా కెరీర్ ప్రారంభించింది. 2011లో ఆమె నటించిన మర్డర్2 ద్వారా ఆమె మొట్టమొదటి సక్సెస్ అందుకుంది. ఈ సినిమా విజయవంతం కావడంతో వరసగా ఆమెకు గ్లామర్ పాత్రలే ఎక్కవగా వచ్చాయి.