హాలివుడ్ రేంజ్ అడ్వెంచరస్ థ్రిల్లర్ మూవీ ‘సాహో’ సంగతులు రోజుకొకటి బయటికొస్తూ సినీ ప్రియుల్ని ఎంతో ఊరిస్తున్నాయి. ముఖ్యంగా డార్లింగ్ ఫాన్స్ ఈ వార్తలు షేర్ చేసుకుంటూ పిచ్చ హ్యాపీగా ఉన్నారు. ఇంతకీ ఈ మూవీలో ప్రభాస్ డబుల్ రోల్ పోషించాడా..? లేక రెండు గెటప్స్ ఉన్నాయా? అనే అంశం తాజాగా ఆసక్తి కలిగిస్తోంది. దీనికి తోడు ఒక్క బాడ్ బాయ్స్ సాంగ్‌కే శ్రీలంక భామ జాక్విలాన్ ఫెర్నాండేజ్ రెండు కోట్ల రూపాయలు తీసుకుందని ప్రచారం. ప్రభాస్, జాక్విలాన్ ఫెర్నాండేజ్‌పై చిత్రీకరించిన బాడ్‌బాయ్స్ హాట్ సాంగ్ యూత్‌కి యమ కిక్ ఇస్తుందని చెబుతున్నారు. గ్లామర్ డాల్ డ్రెస్సింగ్, డ్యాన్స్ మూమెంట్స్ ఉర్రూతలూగిస్తాయని మూవీ వర్గాల టాక్. జాక్విలాన్ ఫెర్నాండేజ్ రెమ్యూనరేషన్‌కు తోడు లోకేషన్స్, కాస్ట్యూమ్స్, సాంగ్ ప్రొడక్షన్ చాలా కాస్ట్లీ అంటున్నారు. భారీ బడ్జెట్ మూవీలో ఇది స్పెషల్ ఎట్రాక్షన్.
ఇక సాహో రిలీజ్ డేట్ కౌంట్ డౌన్ బిగిన్ కావడంతో ప్రభాస్‌కు ఒకటే టెన్షన్. ‘సినిమా రిలీజ్‌కు ముందు రోజు బాగా నిద్రపోవాలని అనుకుంటా… కానీ ప్రేక్షకుల రెస్పాన్స్ ఎలా ఉంటుందోనని టెన్షన్‌తో నిద్ర ఎలా పడుతుంద’ని ప్రభాస్ ‘ది కపిల్ శర్మ టాక్ షో’లో ఎదురు ప్రశ్న వేశాడు. ఈ నెల 30న రిలీజ్ వరకు ప్రభాస్ మూవీ ప్రమోషన్స్‌లో బిజీబిజీ.. రెండేళ్ళ కష్టం మరి..! కెరీర్లో ఆ మాత్రం కేర్ తప్పదు కదా..!