పౌరసత్వ చట్టంపై కోల్ కతాలోని జాదవ్ పూర్ యూనివర్సిటీ విద్యార్ధిని ఊహించని రీతిలో నిరసన తెలిపి అక్కడున్న వారినందరిని ఆశ్యర్యానికి గురి చేసింది. దేబోస్మిత చౌదరి అనే విద్యార్ధిని ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో ఎం.ఎ డిగ్రీ పూర్తి చేశారు. మంగళవారం జరిగిన స్నాతకోత్సవంలో ఆమె వైస్ ఛాన్స్ లర్ నుంచి పట్టాను, మెడల్ ను అందుకుంది. వెంటనే అదే స్టేజ్ మీద పౌరసత్వ చట్టం కాపీని ముక్కలు ముక్కలుగా చించి వేసింది. ”హమ్ కాగజ్ నహీ దిఖాయేంగే ( వేమే ఐడెంటిటీ కార్డులన చూపించం)..ఇంక్విలాబ్ జిందాబాద్” అంటూ నినాదాలు చేస్తూ స్టేజ్ దిగి వెళ్లిపోయింది. ఊహించని ఈ సంఘటన స్టేజీ మీదున్న వారిని, స్నాతకోత్సవానికి హాజరైన వారిని విస్తు పోయేలా చేసింది.
వైస్ ఛాన్స్ లర్, ప్రొ-ఛాన్స్ లర్ ల ముందు పౌరసత్వ చట్టాన్ని చెత్తబుట్టలో వేయాలనుకున్నాను. అందుకే స్టేజ్ పైనే దాన్ని చింపేశాను అని చెప్పారు.”కన్ఫ్యూజ్ ఏమి లేదు… జాదవ్ పూర్ యూనివర్సిటీని నేను ఎక్కడా అగౌరవ పర్చలేదు. నాకిష్టమైన యూనివర్సిటీలో పట్టా తీసుకోవడం గర్వకారణంగా ఉంది..కాకపోతే సీఏఏ మీద నిరసన వ్యక్తం చేయడానికి నేను స్నాతకోత్సవం వేదికన ఎంచుకున్నాను…నా ఫ్రెండ్స్ గేట్ దగ్గర నిరసనలో కూర్చున్నారు” అని దేబోస్మిత చౌదరి అన్నారు.