తెలంగాణ నుంచి ఎంత ధాన్యం కొంటారో కేంద్రం స్పష్టత ఇవ్వట్లేదన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. బీజేపీ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డ మంత్రి.. విద్యుత్ చట్టంతో ఎవరికి లాభమో చెప్పాలని ప్రశ్నించారు. దీనిపై అన్ని విషయాలు బయట పెడుతామని హెచ్చరించారు.
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి తీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవ చేశారు జగదీష్ రెడ్డి. రాష్ట్రంలో వరి ధాన్యం ఎందుకు పెరిగింది..? గుజరాత్‌లో ఎందుకు పెరగలేదు..? బీజేపీ నేతలే చెప్పాలన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం తరఫున మాట్లాడాల్సింది ఎంపీలు కాదు.. కేంద్ర మంత్రులని హితవు పలికారు మంత్రి.