సీఎం జగన్ తెలంగాణకు చెందిన మాజీ అధికారి సహాయం కోరారా…? సీఎస్‌గా, రాష్ట్ర ఎన్నికల కమీషనర్‌గా పనిచేసిన వైఎస్ కుటుంబ సన్నిహితుడు జగన్‌కు అండగా నిలవబోతున్నారా…? సీఎం జగన్‌కు పాలనలో ఆయన చేదోడు వాదోడుగా ఉండబోతున్నారా…?
సీఎం జగన్‌కు పరిపాలన అనుభవం లేదు, దూకుడు తప్పా… కాస్త ఆలోచన లేదు, రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడిపోతుంది, ముందుచూపు లేని నాయకుడు జగన్, పరిపాలనలో జగన్ అట్టర్‌ఫ్లాప్ ఇలా అనేక విమర్శలు ఎదుర్కొంటున్న ఏపీ సీఎం జగన్… రాష్ట్ర ఎన్నికల కమీషనర్‌తో జరిగిన ప్రచ్ఛన్న యుద్దం వరకు ఇంటా బయటా విమర్శలు ఎదుర్కొవటంతో, పాలన వ్యవహరాలపై సీరీయస్‌గా ఉన్నాడని తెలుస్తోంది.
స్థానిక సంస్థల విషయంలో… తన వాదన నెగ్గేందుకు ఇప్పటికే సుప్రీంకోర్టు వెళ్లింది ఏపీ సర్కార్. ఇక నుండి స్థానిక సంస్థల అంశంలో రాష్ట్ర ఎన్నికల కమీషన్ వ్యవహరంతో పాటు పాలన వ్యవహరాల్లో తెలంగాణకు చెందిన మాజీ సీఎస్, రాష్ట్ర ఎన్నికల కమీషనర్‌గా కూడా పనిచేసిన రమాకాంత్ రెడ్డిని సీఎం జగన్ హుటాహుటిన పిలిపించుకున్నట్లు తెలుస్తోంది.
గతంలో వైఎస్‌కు అత్యంత సన్నిహితంగా ఉన్న ఈ అధికారి… జగన్‌పై ఉన్న అక్రమాస్తుల కేసుల్లో ఆరోపణలు కూడా ఎదుర్కొన్నాడు. దీంతో రమాకాంత్ రెడ్డితో ఉన్న సాన్నిహిత్యంతో పాటు పరిపాలన అనుభవం తనకు ఉపయోగపడుతుందని, ఇప్పటికిప్పుడు ఎస్‌ఈసీ రమేష్‌కుమార్ ఇష్యూలో తనకు మార్గదర్శకత్వం చేయాలని కోరినట్లు తెలుస్తోంది.