మంత్రి కేటీఆర్ పై ఏపీ సీఎం జగన్ ఫ్యాన్స్ ట్రోలింగ్ ఆపడం లేదు. ఆమధ్య పక్క రాష్ట్రాల్లో కరెంట్ లేదు.. రోడ్లు లేవు అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. ఏపీలో పరిస్థితి గురించే ఆ కామెంట్స్ చేశారని ప్రతిపక్షాలు బాగా ప్రచారం చేశాయి. దీంతో వైసీపీ అభిమానులు రంగంలోకి దిగి కేటీఆర్ ను ఓ ఆటాడుకున్నారు. చివరకు ఆయన వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
Bangaru Telangana 🙄🙏 @KTRTRS#HyderabadRains pic.twitter.com/MUPpT2lyiI
— YS Jagan Trends™ (@YSJaganTrends) May 4, 2022
అయితే.. కేటీఆర్ వివరణకు జగన్ ఫ్యాన్స్ సంతృప్తి చెందనట్లు కనిపిస్తోంది. తాజాగా హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. దీంతో చాలా మంది వరద నీటిలో చిక్కుకుపోయారు. అధికారులు ట్యూబ్ బోట్ సాయంతో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
KTR frnd enjoying in Hyderabad mini Swimming pools 😍pic.twitter.com/4Bfoaatvv7
— YS Jagan Trends™ (@YSJaganTrends) May 4, 2022
ఈ వీడియోలను బేస్ చేసుకుని జగన్ అభిమాన సంఘాలు.. కేటీఆర్ ను మరోసారి ఆటాడుకుంటున్నాయి. ‘‘చూడండి కేటీఆర్ ఫ్రెండ్ హైదరాబాద్ లోని మినీ స్విమ్మింగ్ పూల్ లో ఎంజాయ్ చేస్తున్నాడు’’ అంటూ ఆ వీడియోలను తెగ షేర్ చేస్తున్నారు.
Free boating in Hyderabad Bangaru #Telangana !!
For more exciting offers Contact @KTRTRS anna#HyderabadRains pic.twitter.com/GXgsJp5Cui
— YS Jagan Trends™ (@YSJaganTrends) May 4, 2022
ఒక్క వర్షానికే నగరం ఇలా అయితే రాబోయే వర్షాకాలంలో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి.. పక్క రాష్ట్రంపై ఏడవడం కాదు.. ముందు ఇక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో చూసుకోవాలని జగన్ అభిమానులు కేటీఆర్ పై విరుచుకుపడుతున్నారు.
Velu kuda Andhra ni cmnt cheyatame 🤣🤣
Hi anna @KTRTRS me frnd ni adigaanu ani chepu https://t.co/26ABqN0Gag
— YS Jagan Trends™ (@YSJaganTrends) May 4, 2022
Advertisements