గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. 58 సంవత్సరాలున్న రిటైర్మెంట్ వయస్సును 60 సంవత్సరాలకు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇప్పటికే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది దసరా వేళ ఆర్టీసీ ఉద్యోగులకు సర్కార్ కానుక.