ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్‌లో రూ.9కోట్ల షేర్లున్నాయన్నారు టీడీపీ నేత పట్టాభి. స్వయంగా జగనే.. ఎన్నికల అఫిడవిట్ లో తనకు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్‌లో షేర్లు ఉన్నట్టు పేర్కొన్నారని చెప్పారు. ఈ విషయంలో వైసీపీ నేతలు వాస్తవాలను కప్పిపుచ్చుతున్నారని ఆయన మండిపడ్డారు. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కంపెనీ ప్రతినిధులను మంత్రి మేకపాటి బెదిరించారని పట్టాభి ఆరోపించారు. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ను తరిమేసి భూములను ఆక్రమించుకునేందుకు ఏపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు పట్టాభి.