ఇంగ్లీష్ మీడియంపై ఏపీ సర్కార్ కాస్త వెనుకంజ వేసింది. వచ్చే ఏడాది నుండి ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేస్తామని సీఎం జగన్ ప్రకటించగానే ఎంత వివాదం చెలరేగిందో అందరికీ తెలిసిందే.
దాంతో కాస్త వెనకడుగు వేసిన ప్రభుత్వం… ఇంగ్లీష్ మీడియం వచ్చే ఏడాది నుండే ప్రారంభిస్తున్నా, మొదటి దశలో 1వ తరగతి నుండి 6వ తరగతి వరకు మాత్రమే ప్రవేశపెట్టబోతున్నారు. గతంలో ప్రభుత్వం 8వ తరగతి వరకు ఉంటుందని పేర్కొంది. తాజాగా సవరించిన జీవోను విడుదల చేసింది ఏపీ సర్కార్.
అయితే, తెలుగు లేదా ఉర్ధూను కచ్చితంగా ఒక సబ్జెక్ట్‌గా ఉంచాలని తెలిపింది. రాబోయే రోజుల్లో ఇంగ్లీష్ మీడియంలో ప్రావీణ్యం ఉన్న టీచర్లను నియమించాలని పాఠశాల విద్యాశాఖను ప్రభుత్వం ఆదేశించింది.