మొదటిసారి ముఖ్యమంత్రి హోదాలో సీబీఐ కోర్టుకు నేడు జగన్ రాబోతున్నారు. ఉదయం 9.30కి గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరి 10.10 నిమిషాలకు బేగంపేటకు చేరుకోనున్నారు. ఉదయం 10.30కి సీబీఐ కోర్టుకు జగన్ హాజరు కానున్నారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు సీబీఐ కోర్టులోనే జగన్ ఉంటారు. ముఖ్యమంత్రి జగన్ దాదాపు 4 గంటలు పాటు కోర్ట్ లో ఉండటంతో సీబీఐ కోర్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు తెలంగాణ పోలీసులు. న్యాయవాదులు, కోర్టు ఉద్యోగులకు తప్ప మరెవరికి లోనికి లోపలికి అనుమతించకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. సాయంత్రం నాలుగు గంటల తర్వాత బేగంపేట విమానాశ్రయం నుండి తిరిగి వెళ్లనున్నారు ఏపీ సీఎం జగన్.