తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కలిశారు. ఉదయం జరగాల్సిన సమావేశం సాయంత్రానికి వాయిదాపడింది. కేసీఆర్ వ్యూహాత్మకంగా సమావేశాన్ని సాయంత్రానికి వాయిదావేయించినట్టు సమాచారం. ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య గోదావరి జలాల తరలింపు, ఉమ్మడి ఆస్తుల పంపిణీ వివాదాలు, ఇతర అంశాలు చర్చకు వస్తాయని పైకి చెబుతున్నప్పటికీ కేంద్రంతో ఎలా వ్యవహరించాలనే అంశంపై కేసీఆర్ సూచనల మేరకు జగన్ అత్యవసరంగా బయల్డేరి వచ్చినట్టు తెలుస్తోంది.