ప్రతిపక్షాల పొత్తులపై సీఎం జగన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు . వెన్నుపోటుదారులకు, మీ బిడ్డకు మధ్య యుద్ధం జరుగుతోందన్నారు. మీ బిడ్డకు పొత్తులు ఉండవని, ఒంటరిగానే సింహం లాగా పోరాడుతాడన్నారు. రాష్ట్రంలో తోడేళ్లన్నీ ఏకం అవుతున్నాయని అన్నారు.
సీఎం జనగ్ వినుకొండలో పర్యటించారు. జగనన్న చేదోడు పథకం ద్వారా బటన్ నొక్కి లబ్ధిదారులకు నిధులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… తోడేళ్లన్నీ ఒక్కటవుతున్నాయన్నారు. తోడేళ్ళన్నీ ఒక్కటై వచ్చినా ప్రజలు ఇచ్చిన బలంతో వారిపై పోరాడుతానన్నారు.
లంచాలు, వివక్ష లేని మీ బిడ్డ పరిపాలన కావాలా? లేదా గజదొంగల పరిపాలన కావాలా? మీరే తేల్చుకోండని అన్నారు. తాను గజదొంగలను నమ్ము కోలేదన్నారు. తాను తన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, పేద ప్రజలను నమ్ముకున్నానని పేర్కొన్నారు. మీ బిడ్డ ఒక్కడే సింహంలా పోరాడతాడన్నారు. మీ కోసం పోరాడతాడని చెప్పారు. ప్రజల దీవెనలు తనపై ఉండాలని ఆయన కోరుకున్నారు.
రాష్ట్రం శ్రీలంక అయిపోతోందంటూ కొందరు అబద్ధాలు చెబుతున్నారన్నారు. గతంలో డ్రాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తామని చెప్పి మోసం చేశారన్నారు. గతంలో ముసలాయన్ని చూశామన్నారు. అన్నీ అబద్ధాలే చెప్పారన్నారు. గతంలో ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్ వుండేదన్నారు. గతంతో పోలిస్తే అప్పుల వృద్ధి తక్కువే ఉందన్నారు.
గతంలో బటన్లు ఎందుకు లేవన్నారు. ఖాతాల్లోకి డబ్బులు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. గతంలో రాష్ట్రాన్ని గజదొంగల ముఠా దేచేసిందన్నారు. గతంలో ఓ ముసలాయన(చంద్రబాబు)సీఎంగా ఉండేవారన్నారు. ఓ గజ దొంగల ముఠా ఉండేదన్నానరు.
ఈనాడు, టీవీ5, ఆంధ్రజ్యోతి, చంద్రబాబు, దత్తపుత్రుడు వీళ్లంతా గతదొంగల ముఠా అని అన్నారు. వాళ్లు సంక్షేమ పథకాలను డీబీడీ ద్వారా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఎందుకంటే వాళ్లది డీపీటీ విధానమన్నారు. డీపీటీ అంటే దోచుకో, పంచుకో, తినుకో అని ఎద్దేవా చేశారు.
ప్రశ్నిస్తానన్న దత్తపుత్రుడు అన్నాడని, ఇప్పుడు అతను ఏం చేశాడో చూశారు కదా అని అడిగారు. ఇది పేదవాడికి, పెత్తందారుకి మధ్య నడుస్తున్న యుద్ధమన్నారు. మాట ఇస్తే నిలబడే వ్యక్తి ఓ వైపు ఉండగా, వెన్నుపోట్లు, మోసాలు చేసే తోడేళ్లు మరో వైపు ఉన్నారన్నారు.