ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం థియేటర్లలో 50% ఆక్యుపెన్సీ నిబంధనను ఎత్తివేసి, రాష్ట్రవ్యాప్తంగా రాత్రిపూట కర్ఫ్యూలను ఎత్తివేస్తే, ఫిబ్రవరి 25న భీమ్లా నాయక్ చిత్రాన్ని విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు మేకర్స్.
కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం… జగన్ కొత్త GO ను ఫిబ్రవరి చివరి వారం వరకు విడుదల చేయకూడదు అనే ఆలోచనలో ఉన్నాడట.ఒక విధంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ విడుదల తర్వాత మాత్రమే GO విడుదల అవుతుందని తెలుస్తోంది.
ఇదే విషయమై పవన్ అభిమానులు కూడా రకరకాలు మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న ధరలతో అయితే పెద్ద సినిమాలకు కష్టాలు తప్పవు.ఏపీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ ను టార్గెట్ పెట్టుకుంటే మాత్రం ఫిబ్రవరి వరకు కొత్త GO రాదు. మరి చూడాలి ఏం జరుగుతుందో.
ఇక సాగర కె చారేంద్ర దర్శకత్వం వహించిన భీమ్లా నాయక్ సినిమాలో పవన్ తో రానా కూడా నటిస్తున్నాడు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.