గుంటూరు: ఎమ్మెల్యే శ్రీదేవిని దూషించిన కేసులో నిందితుల్ని గుర్తించి అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ హోంమంత్రి సుచరితను ఆదేశించారు. సీఎం జగన్‌తో హోంమంత్రి సుచరిత, ఎమ్మెల్యేలు శ్రీదేవి, ఆర్కే సమావేశం అయ్యారు. ఎమ్మెల్యే శ్రీదేవిని కులం పేరుతో దూషించిన ఘటనపై జగన్ ఆరా తీశారు. జరిగిన అవమానాన్ని శ్రీదేవి.. సీఎం దృష్టికి తీసుకొచ్చింది. కులం పేరుతో తనను దూషించారని జగన్‌కు వివరించింది. రాష్ట్రంలో ఏ మహిళకూ ఇలాంటి పరిస్థితి రాకూడదని సీఎం జగన్ అన్నారు. ఏ పార్టీకి చెందినవారైనా ఇలాంటి అవమానకర పరిస్థితులు ఎదురుకాకూడదని అభిప్రాయపడ్డారు. బడుగు బలహీనవర్గాలను కలుపుకొని ముందుకెళ్లే వాతావరణం ఉండాలని సూచించారు. మహిళల గౌరవానికి భంగం కలిగితే కఠిన చర్యలు తప్పవని సీఎం హెచ్చరించారు.