శ్రీకాకుళం: మొదట సన్న బియ్యం అన్నారు. తర్వాత కాదు కాదు.. నాణ్యమైన తినగలిగే బియ్యం ఇస్తామని చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ స్వయంగా శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభించిన ఈ నాణ్యమైన బియ్యం తీరా చూస్తే ‘పొట్ట విప్పి చూడ పురుగులుండు’ అన్నట్టుగా నిజంగానే పురుగులు పట్టివుంది. దీంతో ఈ స్కీము ఆదిలోనే అభాసుపాలైంది. కవిటి మండలం నెలవంక గ్రామంలో వాలంటీర్ ద్వారా ఇచ్చిన బియ్యం సంచి తెరిచి చూస్తే భయపడే దృశ్యం కనిపించింది. తినడానికి వీలులేని ఆ బియ్యాన్ని చూసి వినియోగదారుడు వాలంటీర్‌పై మండిపడ్డాడు. ఎం.ఆర్.ఓ.తో మాట్లాడి బియ్యం సంచి మార్చి మరో సంచి ఇచ్చారు. ఇదీ నాణ్యమైన బియ్యం..!!